నల్లధనమేమైంది?
– 15 లక్షలు ఖాతాల్లోకి ఎందుకు రాలేదు
– రైతు ఆత్మహత్యలపై మౌనమేలా?
– ప్రధాని మోదీపై రాహుల్ ఫైర్
లక్నో,అక్టోబర్7(జనంసాక్షి):
బీహార్ కు ప్రత్యేక ¬దా ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ముందడుగు వేయడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రధాని మోడీకి రైతులను పట్టించుకోవడం కంటే డ్రస్సులు మార్చడం అంటేనే ఇష్టమన్నారు. ప్రధాని అయిన తర్వాత మోడీ ఒక్క రైతుతో కూడా ఫోటో దిగిన సందర్భం లేదన్నారు. పేదలు, కార్మికులు, రైతులతో మాట్లాడి, వారి మనసులో మాట తెలుసుకునే తీరిక ప్రధాని మోడీకి లేదని రాహుల్ విమర్శించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షిక్ పురలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. దేశ ప్రజల ఖాతాలోకి 15లక్షలరూపాయలు జమచేస్తామన్న ప్రధాని అఉసే ఎత్తడం లేదన్నారు. ఎన్నికల వాగ్ధానాల్లో ప్రధానంగా పేర్కోన్న నల్లడబ్బు ఎందుకు రప్పించలేక పోయారో దేశప్రజలకు చెప్పాలన్నారు.దేశంలో పెరిగి పోతున్న రైతు ఆత్మహత్యలపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని రాహుల్ తీవ్రంగా ఆక్షేపించారు.