నల్లూరు లో కంటి వెలుగును ప్రారంభించిన మండల ప్రజా ప్రతినిధులు
ముప్కాల్(జనం సాక్షి) మార్చ్28 నల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాని ప్రారంభించారు. సందర్భంగా వారు .ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విదంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమన్నీ ప్రవేశ పెట్టారని కంటి వెలుగు అద్భుతమైన కార్యక్రమమని ఇది పేద ప్రజలకు చాలా ఉపయోగకరమైనదని వారు అన్నారు. పంచాయతీలో 10 రోజులు కంటి వెలుగు శిబిరం జరుగుతుందని వారు తెలిపారు.ప్రతీ ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు,కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని అవసరం అయినా వారికి కంటి శస్త్ర చికిత్సలు చేయడం జరుగుతుంది వారు తెలిపారు.ఈ అద్భుతమైన కార్యక్రమాన్నీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.శిబిరాలకు వచ్చేవారు వెంబడి ఆధార్ కార్డు తీసుకురావాలని వారు తెలిపారు.ఈకార్యక్రమానికి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్,రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలోసర్పంచ్ సుగుణ నారాయణ, జడ్పిటిసి బద్దం నరసవ్వ నర్సారెడ్డి,,ఉప సర్పంచ్ స్రవంతి నవీన్, ఎంపీటీసీ సత్యనారాయణ, విలేజ్ ప్రెసిడెంట్ రఘు,డాక్టర్ రాకేష్, పంచాయతీ సెక్రటరీ శంకర్,కారోబార్ గంగాధర్,ఫీల్డ్ అసిస్టెంట్ బర్కం భూమేశ్వర్ ,ఆశా వర్కర్లు ఏఎన్ఎం అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు