నల్ల కుబేరులపై విచారణ చేపట్టండి!

5

విదేశాల్లో నల్లధనం దాచుకున్న 500 మంది భారతీయులపై విచారణ చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. పనామా పేపర్స్ పేరుతో బయటపడ్డ సంపన్నుల అక్రమ లావాదేవీలను వెలికి తీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. పలు దేశాల నేతలతో పాటు అనేక మంది సెలబ్రిటీలు పనామాలో అక్రమ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కుంభకోణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు చైనా అధ్యక్షుడు జీ జింగ్ పింగ్, నవాజ్ షరీఫ్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లాంటి వాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టులు వెల్లడించిన రహస్య విషయాలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.