నల్ల కుబేరుల జాబితాలో ఇద్దరు భారతీయ మహిళలు
బెర్న్, మే25(జనంసాక్షి) : వల్లకుబేరుల జాబితాలో ఇద్దరు భారతీయ మహిళల పేర్లు వెలుగులోకొచ్చాయి. స్విట్జర్లాండ్‌లోని స్విస్ బ్యాంకు ఖాతాలలో నల్లధనాన్ని దాచుకున్న నల్ల
కుబేరుల పేర్లను స్విట్జర్లాండ్ వెల్లడించింది. ఈ నల్ల కుబేరులు పేర్ల జాబితాలో ఇద్దరు భారతీయ మహిళలు స్నేహలత సాహ్నీ, సంగీత సాహ్నీలు ఉన్నారు. స్విట్జర్లాండ్
వెల్లడించిన నల్ల కుబేరుల జాబితాలో ఉన్న వీరిని 30 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. సమాధానం రాకుంటే పూర్తిగా వెల్లడిస్తామని స్విస్ హెచ్చరించింది. ఈ జాబితాలో 40 సమస్యాత్మక పేర్లు స్విస్ ఫెడరల్ గెజిట్‌లో నమోదైనట్టు వెల్లడించింది. స్విస్ వెల్లడించిన నల్ల కుబేరుల జాబితాలో అమెరికా, ఇజ్రాయెల్,
స్పానిష్, రష్యా పౌరుల పేర్లు కూడా ఉన్నాయి.