నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

111

నిన్న స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 160 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. బంగారం, వెండి ధరలు పుంజుకుంటున్నాయి. బంగారం ధర పది గ్రాములకు 220 రూపాయలు పెరిగి 29వేల 185లు పలుకుతోంది. వెండి ధర కూడా 2వందలు పెరిగింది. అయితే, ఇవాళ నుంచే బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుండడంతో దేశీయ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులేస్తున్నారు. డాలర్‌ తో రూపాయి మారకం విలువ కాస్త తగ్గింది. 68 రూపాయల 50పైసల వద్ద ట్రేడవుతోంది. దేశీయ మార్కెట్లో టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, మారుతీ సుజుకీ లాభాల్లో కొనసాగుతుండగా… ఎస్‌బీఐ, ఐసిఐసిఐ, కొటక్‌ మహీంద్ర నష్టాల్లో ట్రేడవుతున్నాయి.