నష్టాల్లోకి జారుకున్న దేశీయ మార్కెట్లు
ముంబై,డిసెంబర్10(జనంసాక్షి): దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభ బలహీనత మరింత ముదిరి సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కుప్పకూలింది. రికార్డుర్యాలీ తరువాత ఇన్వెస్టర్ల అమ్మకాలతో కీలక సూచీలు మద్దతు స్థాయిన దిగువకు చేరాయి. ముఖ్యంగా మిడ్ సెషన్ నుంచి పెరిగిన అమ్మకాలతో సెన్సెక్స్ 40300 దిగువకు, నిప్టీ 11900 దిగువన ట్రేడ్ అవుతున్నాయి. 240 నష్టంతో 40243 వద్ద సెన్సెక్స్, నిప్టీ 79 పాయింట్ల నష్టంతో 11861 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, ఆయిల్ గ్యాస్ రంగాలు నష?టపోతున్నాయి. యస్ బ్యాంకు ఏకంగా 10శాతం నష్టపోయింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్, గెయిల్, భారతి ఇన్‌ఫ్రాటెల్,టీసీఎస్ బీపీసీఎల్ , ఎం అండ్‌ఎం భారీగా నష్టపోతుండగా, హెచ్‌యూల్, బజాజ్ ్గ/నాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతి ఎయి/-ట్గం/ల్, ఐసీఐసీఐ బ్యాంకు,కోటక్ మహీంద్ర, సన్‌ఫార్మ లాభపడుతున్నాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి డాలరుమారకంలో 10పైసల లాభంతో కొనసాగుతోంది.
వడ్డీరేట్లను తగ్గించిన బ్యాంక్ ఆఫ్ బరోడా
ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల బాటలో ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా పయనిస్తోంది. ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బ్యాంక్‌తాజాగా ఎంసీఎల్‌ఆర్ వడ్డీరేట్లను అత్యధికంగా 20 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించింది. ఈ తగ్గింపు వివిధ కాలవ్యవధి రుణాలపై వివిధ రకాలుగా ఉండనుంది. నెలవారీ రుణాలపై 20బేసిస్ పాయింట్లు తగ్గి 7.65శాతం వడ్డీరేటుకు రానుంది.. ఇక మూడునెలలు.. ఆరునెలల ఎంసీఎల్‌ఆర్‌లు 7.80శాతం, 8.10శాతంగా ఉన్నాయి. ఏడాది కాలవ్యవధి కలిగిన వాటిపై 8.25శాతం వసూలు చేయనున్నారు. ఈ మార్పు డిసెంబర్ 12 నుంచి అమల్లోకి రానుంది. ఈ సారి పరపతి విధాన సవిూక్షంలో ఆర్‌బీఐ వడ్డీరేట్లలో మార్పు చేయకపోయినా బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించడం విశేషం.రోపక్క ఎస్‌బీఐ కూడా ఏడాది కాలవ్యవధి కలిగిన రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం ఇది వరుసగా ఎనిమిదో సారి కావడం గమనార్హం. ఏడాది కాలవ్యవధి కలిగిన రుణాలపై వడ్డీ రేట్లను 8 శాతం నుంచి 0.10 శాతం తగ్గించి 7.90 శాతంగా చేసింది. వివిధ కాలావధి రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) 20 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించింది. ఏడాది కాలవ్యవధి కలిగిన రుణాలపై ప్రస్తుతం 8.30 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8.20 శాతానికి బ్యాంక్ తగ్గించింది.