నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ యంగ్ బ్రిగెడ్ అధ్యక్షుడిగా బొడ్డు అలరాజు యాదవ్.
అచ్చంపేట ఆర్సి , 30 జూలై (జనం సాక్షి న్యూస్) : నియోజకవర్గంలోని పదర మండల కేంద్రానికి చెందిన బొడ్డు అలరాజు యాదవ్ నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ యంగ్ బ్రిగేడ్ అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. ఈ మేరకు శనివారం నాడు కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ సుబ్రహ్మణ్యం మరియు కాంగ్రెస్ సేవాదళ్ యంగ్ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ లు సంయుక్తంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ లో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సేవాదళ్ యంగ్ బ్రిగెడు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు అలరాజు యాదవ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి త్వరలోనే జిల్లా పరిధిలోని మండలాలలో కమిటీలు ఏర్పాటు చేసి ముందుకు సాగుతూ తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ ఛీ ఆర్గనైజర్ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర అధ్యక్షుడు తేడా శ్రవణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ కాసాల నాగిరెడ్డి, మరియు సతీష్ యాదవ్, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.