నాగాలాండ్‌ హోంమంత్రి రాజీనామా

కోహీమా : కారులో ఆయుధాలు, నగదుతో తరలిస్తూ అరెస్టయిన నాగాలాండ్‌ హోంమంత్రి ఇమ్కాంగ్‌ ఎల్‌ ఇంచేన్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ముఖ్యమంత్రికి అందించారు. నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో నిన్న పోలీసులు విస్త్రత తనిఖీలు చేపట్టారు. వోకా జిల్లా సరిహద్దులో  హోంమంత్రి ఇమ్కాంగ్‌ ఎల్‌ ఇంచేన్‌ కారులో పోలీసులు భారీగా ఆయుధాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు రూ. కోటి నగదును కూడా పట్టుకున్నారు. అనంతరం హోంమంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 23న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు విస్త్రత తనిఖీలు చేపడుతున్నారు.