నాగేంద్రస్వామికి వెండి వస్తువుల బహుకరణ

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 27(జనం సాక్షి)

 

వరంగల్ నగరంలోని శ్రీ నాగేంద్ర స్వామి( నాగమయ్య గుడి )ఆలయంలో మంగళవారం నాగేంద్ర స్వామికి కరీమాబాదుకు చెందిన మిట్టపల్లి భాస్కర్ భవాని కుటుంబ సభ్యులు ఒక కిలో 18 గ్రాముల వెండి వస్తువులను బహుకరించారు. ఇందులో మంగళహారతి పళ్లెం, పంచపాలి, ఉద్ధరిని, పంచ పాత్ర ప్లేటు మొదలైన వస్తువులు ఉన్నాయి. రూపాయలు 61,వేల 800 విలువగల వస్తువులను స్వామివారికి బహుకరించినట్లు మిట్టపల్లి భాస్కర్ భవాని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కమల, ప్రధాన అర్చకులు జాగర్లపూడి శ్రీరాం శర్మ, ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.