*నాటి పోరాట యోధుడు దుర్గ్య నాయకు కు సన్మానించిన ఎర్రబెల్లి*

 *దేవరుప్పుల, సెప్టెంబర్ 18 (జనం సాక్షి):*
నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, దర్గ్యా రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదివారం ఆయన స్వగ్రామం దేవరుప్పుల మండలం ధర్మ పురం తండాకు వెళ్లి కలిశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి, ఆయ‌న ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయ‌న ఆయు ఆరోగ్యాల‌తో ఉండాల‌ని ఆకాంక్షించారు. ఆనాటి పోరాట స్మృతుల‌ను  నెమ‌రు వేసుకుంటూ, ఆనాటి అమ‌రుల త్యాగాల‌ను కీర్తిస్తూ, విలీన దినోత్స‌వాన్ని తెలంగాణ జాతీయ స‌మైక్య‌త‌ వ‌జ్రోత్స‌వాల వేడులుగా రాష్ట్ర‌ ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం కెసిఆర్ నిర్వ‌హిస్తున్న మూడు రోజుల వేడుక‌లు, ఏడాదంతా నిర్వ‌హిస్తున్న ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను మంత్రి ఆయనకు చెప్పారు. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని, సిఎం కెసిఆర్ ని, మంత్రి ఎర్ర‌బెల్లిని చుక్కా రామ‌య్య అభినందించారు. వ‌యో భారంతో కూడిన ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న దర్గ్యా నాయక్ ను జాతీయ స‌మైక్య‌త‌ వ‌జ్రోత్స‌వాల వేడుల సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి స‌న్మానించారు.
Attachments area