*నాటు సారాయి తయారు అమ్మకాలు మరియు రవాణా జరిపే వారిపై కఠిన చర్యలు ఎక్సైజ్ సీఐ రాధ*
మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 26 :
జనం సాక్షి
మెట్పల్లి ఎక్సైజ్ పరిధిలోని మెట్పల్లి ,ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, కథలాపూర్ మండలాల్లో నాటు సారాయి తయారు మరియు అమ్మకాలు జరిపే వారిపై దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నామని, పల్లి పట్టణంలోని పత్రిక సమావేశంలో ఎక్సైజ్ రాధా తెలిపారు. ఈ సందర్భంగా సిఐ రాధా మాట్లాడుతూ జనవరి 2021 నుండి సెప్టెంబర్ 2022 వరకు ఎక్సైజ్ అధికారులు జరిపిన దాడులలో ఒక 135 నాటు సారాయి కేసులు నమోదు చేసి, 118 మందిని అరెస్టు చేసినట్లు తెలిపి, 521 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకొని 6120 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ,221 కిలోల బెల్లం 10 కిలోల పటిక ,23 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. వివిధ మండలాల్లో తాహసిల్దార్ ఎదుట 136 మందిని బైండోవర్ చేసామని, వీరులో నలుగురు వ్యక్తులు బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా విధిస్తూ, ఇద్దరికి 25వేల రూ. చొప్పున మరొకరికి 20వేల రూ. జరిమానా విధిస్తూ, ప్రభుత్వ ఖజానాకు మొత్తం 70 వేల రూ. జమచేసి, ఇంకొకరు జరిమానా కట్టనందుకు జైలుకు పంపినట్లు తెలిపారు. పై విధంగా నాటు సారాయి నియంత్రించడం ద్వారా మద్యం విక్రయాలు పెరిగి
01 జనవరి 21 నుండి డిసెంబర్ 2021 వరకు 252,67,79,183 రూ, 01 జనవరి 2022 నుండి 26 సెప్టెంబర్ 2022 వరకు 199,84,02,557రూ. ప్రభుత్వ ఆదాయం వచ్చిందన్నారు ప్రజలు నాటు సారాయి గురించి ఎటువంటి సమాచారం ఉన్న 9440902708 నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నాటు సారాయి తయారు, సరఫరా, అమ్మకాలు, చేపడితే కఠిన చర్యలు ఉంటాయని, అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించామని ఎవరైనా ఎక్కడైనా నాటు సారాయి తయారీ అమ్మకం రవాణా చేస్తున్నట్లు తెలిస్తే మాకు సమాచారం ఇచ్చి నాటు సారాయి సంపూర్ణంగా అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని ఎక్సైజ్ సిఐ రాధా కోరారు