నాట్స్ సాహిత్య పోటీల విజేతలు
డల్లాస్: డల్లాస్‌లోని ఇర్వింగ్ కన్వెస్షన్ సెంటర్‌లో జులై 4,5,6వ తేదీలలో జరగబోయే 3వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను పురస్కరించుకుని సాహిత్య కార్యక్రమాల నిర్వహకులు ఈ కింద సాహిత్య అంశాలలో పోటీలు నిర్వమించారు.
కథలు
కవితలు
ఫొటో కవితలు
చందస్సుతో కూడిన పద్యాలు
ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వందల మంది రచయితలు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు. వివిధ అంశాలలో వచ్చిన రచనలను అయా రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, రచనలను నిశితంగా పరిశీలించి ఈ క్రింది విజేతలను నిర్ణయించారు. ఈ సందర్భంగా పోటీలలో పాలు పంచుకున్న ఔత్సాహికులైన రచయి(త్రు)తలకు, న్యాయ నిర్ణేతలుగా వ్యహరించిన సాహితీ మిత్రులకు, సాహిత్య కార్యక్రమాల కార్యవర్గ సభ్యులకు నాట్స్ సంబరాల సాహిత్య కార్యక్రమాల సమన్వయకర్త అనంత్ మల్లవరపు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు జులై 4,5,6వ తేదీలలో జరిగే ప్రత్యేక సాహిత్య కార్యక్రమాల వేదిక జ్ఞాపిక మరియు బహుమతి ప్రదానం ఉంటుందని తెలియజేశారు.
కథలు పోటీల విజేతలు
కథలు పోటీల విజేతలు
మొదటి బహుమతి: రంగపిన్ని ఆకాశం – సాయి పద్మ (విశాఖపట్నం)
రెండో బహుమతి : గజల్ – రఘు మందాటి (హైదరాబాద్)
మూడో బహుమతి: గులాబి ముల్లు – విజయ్‌ప్రసాద్ కోపల్లె (కర్నూలు)
ఫొటో కవితల ఫొటీల విజేతలు
మొటటి బహుమతి: వలని వలచిన వాళ్లు – కె.వి.వి.డి.రావు (విశాఖపట్నం)
రెండో బహుమతి: పెద్ద సిక్కే పడిందయ్యా!- ఆర్. దయాయంతి (నార్త్ కెరోలినా)
మూడో బహుమతి : ఆశా దీపాలు- వెంకట శాస్త్రి చిలుకూరు(సల్లాస్)
చందస్సుతో కూడిన పద్యాల పోటీల విజేతలు
మొదటి బహుమతి : తెలుగు భాషకు ‘విజయ’వత్సరం
రామమోహన్ అందవోలు (హైదరాబాద్)
రెండో బహుమతి: పద్యాలు – గరికిపాటి సుబ్బావధాని (విజయవాడ)
మూడో బహుమతి : విశ్వవిజేత – విద్యాసాగర్ అందవోలు (డల్లాస్)