నాణ్యత లోపం తో చెక్ డ్యం నిర్మాణాలు
ముస్తాబాద్ మండలంలోని రామ లక్ష్మణ్ పల్లి లో నూతనంగా మానేరు వాగు పై నిర్మిస్తున్న చెక్ డాం నాణ్యత లోపంతో నీటి జల్లు రోజు రోజుకి పెరిగిపోతుంది ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల బిజెపి ప్రధాన కార్య దర్శి క్రాంతి నిర్మాణాన్ని సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నీటివనరులను కాపాడుకోవాలని ఒక ఉద్దేశ్యంతో రైతులకు సంవత్సరానికి రెండు పంటలు పండించుకోవడానికి నీటి కొరత లేకుండా చూడాలని ఒక సంకల్పంతో పని చేస్తుంటే మరోపక్క కింది స్థాయి అధికారులు నాసిరకం పనులతో ప్రభుత్వానికి ఇటు ప్రజలకు న్యాయం చేయడంలో విఫలం అవుతున్నారు ప్రత్యేకంగా రైతుల కోసం నిర్మిస్తున్న ఇలాంటి చెక్ డ్యామ్ లు తూతూమంత్రంగా పనులు నడుస్తున్నాయి కాంట్రాక్టు మాత్రం జేబులు నింపుకునే చేతులు దులుపుకుంటున్నారు మండలంలోని రామలక్ష్మణ పల్లె తుర్కపల్లి శివారులో 2 చెక్ డ్యామ్ లు అంతంత మాత్రమే పనులు కొనసాగుతున్నాయి రెండు సంవత్సరాల నుండి ఇ పనులు తూతూమంత్రంగా నత్తనడక నడుస్తున్నాయి పోయిన సంవత్సరం వాగు వచ్చి కొట్టుక పోయింది రాజుల పైసే రాళ్ళపల్ అవుతుంది ప్రజాధనాన్ని వృధా చేస్తున్న కాంట్రాక్టర్లు ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు తగు చర్యలు తీసుకొని ఛెక్ డ్యంలను పూర్తిస్థాయిలో పరిశీలించలనీ గ్రామస్తులు కోరుతున్నారు