నాబార్డ్‌ సౌజన్యంతో పశురక్షక్‌ శిక్షణా కార్యక్రమం

కరీంనగర్‌్‌,జూలై 25 (జనంసాక్షి): నామాపుర్‌, ముస్తాపూర్‌ మండలాల్లో గురువారం కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు క్వార్జ్‌ మైనింగ్‌ పై నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించాలని తెలంగాణ భూమి రక్షణ సంఘం ప్రజలకు పిలుపునిచ్చింది. కరీంనగర్‌ జిల్లాలో మొట్టమొదటిసారి 56 ఎకరాలలో క్వార్జ్ట్‌ మైనింగ్‌ కొరకు అధికారులు ప్రజాభిప్రాయసేకరణకు వస్తున్నా రనీ, కరీంనగర్‌ జిల్లాలో క్వారీల పేరుతో ఇప్పటికే పర్యావరణాన్ని సర్వ నాశనం చేస్తున్నారనీ, అంతేకాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నా ఇప్పటి వరకు స్పందించని అధికారులు జిల్లాలో మొదటి సారీగా ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్నారని వారు తెలిపారు. ఇప్పటికే గ్రానైట్‌ క్వారీల వల్ల జిల్లాలో లెక్కలేనంతగా పర్యావరణాన్ని హాని కలుగుతుందని వారు పేర్కొన్నారు. ఇప్పుడు 56ఎకరాలలో చేపట్టనున్న క్వార్జ్‌ మైనింగ్‌ వల్ల పర్యావరణం ప్రజల ఆరోగ్యం, పంటల పొలాలకు తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుందని వారు తెలిపారు.

క్వారీల పేరుతో తెలంగాణ వనరులను కొల్లగొట్టాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సహజ వనరులు పోయిన తర్వాత తెలం గాణ ఎడారిగా మారుతుందన్నారు. తెలంగా ణ వనరులన్నీ దోచుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడి ప్రజలకు మిగలేది ఏమీ లేదనీ కావున పర్యావరణానికి, తెలంగాణ ప్రాంతానికి హాని చేసే ప్రజాభి ప్రాయ సేకరణను వ్యతిరేకించాలని, రంగురాళ్ల గుట్టలను కాపాడు కోవాలని కోరింది. తెలంగాణ వనరుల దోపిడీకి జరుగుతున్న కుట్రపై తిరగబడాలని పిలుపునిచ్చింది.