నామినేటెడ్ పదవులపై దృఫ్టి సారిస్తున్న
‘తూర్పు’కాంగ్రెస్‌కాకినాడ, జూలై 30,: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా పెండింగ్‌లో వున్న కార్పొరేషన్‌లు ఇతర నామినేటెడ్ పదవులు భర్తీ చేసే ప్రక్రియకు ఆదిష్టానం ఇప్పటికే గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది.కాకినాడ కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా వున్న పంతం నానాజీ పిసిసి సభ్యునిగా వుండగా, రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ ఇన్ఫాస్ట్రక్టర్ పదవి ఇవ్వడానికి ఆధిస్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.కాంగ్రెస్ సిటీ అద్యక్షునిగా కంపర రమేష్‌ను నియమించడానికి దాదాపుగా రంగం సిద్దమైంది. అలాగే తాను రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోనని స్పష్టంగా ప్రకటించిన డిసిసి అధ్యక్షులు దొమ్మేటి వెంకటేశ్వరరావు కూడా రాష్ట్ర స్థాయి పదవి కోసం రాజధానిలో మకాం వేసి మరీ ప్రయత్నం చేస్తున్నారు. వీరు కాకుండా కాంగ్రెస్‌పార్టీలో సీనియర్‌నాయకులుగా ఉన్న సుమారు 18 మంది ఈ నామినేటెడ్ పదవుల కోసం కృషి చేస్తున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్‌పి రాష్ట్రాధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఉన్న స్నేహ సంబంధాలను ఇంకా కొనసాగించడం వల్ల ఆయన ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీలో ఉన్నా ఆయన ఏ నిమిషం ఏం చేస్తారనే దానిపై సందిగ్ధావస్థ నెలకొని ఉంది. దీంతో కాకినాడ సిటీ కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జ్‌గా పంతం నానాజీని నియమించాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. పిసిసి సభ్యుల నుంచి డిసిసి అధ్యక్షుని వరకు నామినేటెడ్ పదవులపై దృష్టి సారించటంతో తీవ్రపోటీ ఏర్పడింది.ఒకరికి పదవి ఇచ్చి వేరే వారికి ఇవ్వకపోవడంపై వర్గ రాజకీయాలకు తెరతీసినట్టవుతుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అధిష్టానవర్గం ఏ విధంగా చక్కబెడుతుందనే విషయంపై సర్వత్రా సందిగ్ధావస్థ నెలకొని ఉంది.