నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

C

– ఖమ్మంలో ఆవిర్భావ ఉత్సవాలు

– బస్సు యాత్రలు

– టీఆర్‌ఎస్‌ఎల్పీలో సమావేశంలో కేసీఆర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌ ,మార్చి18(జనంసాక్షి):తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఊరిస్తూ నామినేటెడ్‌ పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయి. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. పార్టీ ప్లీనరీ సమావేశంలోపే ప్రభుత్వ నామినేటెడ్‌, పార్టీ పోస్టులు భర్తీ కానున్నాయి. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ ఈ

విషయాన్ని వెల్లడిం చారు.  అలాగే కరువు నివారణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, జిల్లాల వారీగా నివేదికలు తెప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమావేశం వివరాలను విూడియాకు వివరించారు. ఏప్రిల్‌ 27న ఖమ్మంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం ప్రతినిధుల సభ, సాయంత్రం బహిరంగ సభ ఉంటుందన్నారు. బడ్జెట్‌ సమావేశాల అనంతరం సీఎం కేసీఆర్‌ బస్సుయాత్ర చేపట్టనున్నట్లు కడియం తెలిపారు. పార్టీ చేపట్టిన కార్యకర్తల బీమా పథకానికి నెల జీతం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు నిర్ణయించారని, ఇతరులు సాయం చేసినా స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఖమ్మంలో టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలను ఏప్రిల్‌ 27న ఖమ్మంలో ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు కరువు పరిస్థితులు, మంచినీటి ఎద్దడి, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, పార్టీ కమిటీల ఏర్పాటు, శిక్షణ వంటి పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. శాసనసభ, శాసనమండలి జరుగుతున్న తీరుతెన్నులపైనా సవిూక్షించారు. సమావేశం తర్వాత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరాలు వెల్లడించారు. టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలను నిర్వహించేందుకు పార్టీ ఖమ్మం జిల్లా నేతలు ముందుకొచ్చారు. దీతో, ఖమ్మంలో వేడుకలు ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ 27న ఉదయం ప్రతినిధుల సభ, సాయంత్రం భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. పార్టీ కార్యకర్తల ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించడానికి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఇన్సూరెన్స్‌ ప్రీమియం కోసం ప్రజాప్రతినిధులంతా ఒకనెల జీతం విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ప్రజల నుంచి పార్టీ విరాళాలను కూడా అత్యంత పారదర్శకంగా తీసుకోవాలని నిర్ణయించారు. పార్టీకి ఫండ్‌ ఇవ్వదల్చుకున్న వారు నేరుగా బ్యాంకులో జమ చేయాలని కోరారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బంజారాహిల్స్‌ శాఖలో డిపాజిట్‌ చేయొచ్చని తెలిపారు. అకౌంట్‌ నెంబర్‌ 26610100002075, ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ ఃంఖీూఃఖఃఃఊజఆ లో డబ్బులు జమ చేయొచ్చన్నారు. వంద రూపాయల నుంచి ఆర్థిక స్థోమతను బట్టి ఎంతైనా విరాళం ఇవ్వొచ్చని చెప్పారు. వచ్చే నెల 27న జరిగే వార్షికోత్సవ సభలోపే నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లా మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించారు. కార్యకర్తలకు శిక్షణాతరగతులను పార్టీ వార్షికోత్సవ సభలోపే పూర్తి చేయనున్నారు.అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్‌ బస్సుయాత్ర చేపట్టనున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి బస్సుయాత్ర ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం చెప్పారు.మంచినీటి ఎద్దడిపై ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గాల వారిగా సవిూక్షలు చేయాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఏప్రిల్‌ 2 నుంచి జరిగే మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పనుల్లో ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొనాలని సీఎం కేసీఆర్‌ దిశానిర్ధేశం చేశారు. సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని సూచించారు.వేతనాల పెంపు, ఇళ్ల స్థలాలు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు వంటి అంశాలను ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన హావిూ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, టిఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. విూడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసగౌడ్‌ పాల్గొన్నారు.