నామీద కోపం రైతులపై ఎందుకు

1

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ అమేథి,మే19(జనంసాక్షి) :

కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని, ఉద్దేశ పూర్వకంగానే తన నియోజకవర్గానికి అన్యాయం చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. తన నియోజకవర్గం అమేథిలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు పర్యటించిన ఆయన మరోసారి మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. మొత్తం 48 అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడేమో నిధులన్నీ అమేథికి వెళుతున్నాయని అన్నారని, ఇప్పుడేమో అమేథీలో ఏ అభివృద్ధి జరగడం లేదని అంటున్నారని ఈ విషయాలన్ని విూరు గుర్తించాలని రైతులను ఉద్దేశించి అన్నారు. అభివృద్ధి పనులన్నీ ఆపేయడం బీజేపీ సర్కారుకు ఫ్యాషన్‌గా మారిందని, తమ ప్రభుత్వానికి గతంలో ఉన్న మంచిపేరును తస్కరించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. మెగా ఫుడ్‌ ప్రాజెక్టు విషయంలో రైతుల పొట్టకొట్టారని, ఏదైనా కక్ష సాధింపు ఉంటే తనపై తీర్చుకోవాలిగాని రైతులపై వద్దని అన్నారు. మరోపక్క, అమేథిలో మెగా ఫుడ్‌ పార్క్‌ ప్రాజెక్టును పక్కకు పడేసిన విషయానికి సంబంధించి రాహుల్‌ గాంధీ కేంద్ర ¬ంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌కు ప్రత్యేకంగా లేఖ రాసినట్లు తెలుస్తోంది.