నాయిని సతీమణి న్నుమూత
– ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో మరణించిన నాయిని అహల్య
– సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
హైదరాబాద్,అక్టోబరు 26(జనంసాక్షి):మాజీ ¬ం మంత్రి నాయిని భార్య అహల్య(68) కన్నుమూశారు. కరోనా పాజిటివ్ రావటం తో ఆమె కూడా భర్త నాయిని నర్సింహ రెడ్డి తో పాటే ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. ఈ క్రమంలో ఆమె కరోనా నెగిటివ్ వచ్చినా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో ఆమె మరింత అనారోగ్యం పాలయ్యారు. దీంతో పరిస్థితి విషమించి సోమవారం ఆమె కన్నుమాశారు. ఇదిలా ఉంటే భర్త నాయిని నర్సింహ రెడ్డి మృతి తో ఆఖరి చూపు కోసం ఆయన సతీమణి అహల్య ను అంబులెన్స్ లో కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఆ సందర్భంగా ఆమె కన్నీరు మున్నీరయ్యారు. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు. ఐదు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మృతిచెందడంతో నాయిని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది
నాయిని అహల్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
మాజీ ¬ంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి నాయిని అహల్య నరసింహారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అహల్య కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీఎంతోపాటు ¬ంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నిరంజన్ రెడ్డి, అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు తమ సంతాపం ప్రకటించారు. కాగా నాయిని అహల్య నరసింహారెడ్డి మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు. నాయిని నర్సింహారెడ్డి రెడ్డి ఆయన సతీమణి అహల్య నరసింహారెడ్డి రెడ్డి కొద్ది రోజుల తేడాతో చనిపోవడం బాధాకరం. అహల్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి,సంతాపం తెలియచేస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.