నార్త్ కొరియాలో అణ్వస్త్ర సంబరాలు
న్యూఢిల్లీ,సెప్టెంబర్7(జనంసాక్షి): గత ఆదివారం నార్త్ కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షించింది. దీనికి సంకఏతంగా అన్నట్లుగా గురువారం ఆ దేశం అట్టహాసంగా ఆ సంబరాలను జరుపుకున్నది. ప్యోంగ్యాంగ్ వీధుల్లో బాంబును నిర్మించిన శాస్త్రవేత్తలలకు ఘన స్వాగతం లభించింది. ప్రత్యేక బస్సులో సైంటిస్టులు ప్రయాణించారు. సామూహిక సంబరాల్లో వేలాది మంది పాల్గోన్నారు. భారీగా బాణాసంచా పేల్చారు. కిమ్ సంగ్ స్క్వేర్ వద్ద న్యూక్లియర్ సైంటిస్టులకు జనం వెల్కమ్ చెప్పారు. అణ్వాయుధాలతో అమెరికా లాంటి గ్యాంగ్‌స్టర్ దేశాలను అటాక్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు నార్త్ కొరియా ఈ సందర్భంగా ప్రకటించింది.