నాలాల కబ్జాపై జీహెచ్ఏంసీ చర్యలు
మూడు రోజులుగా కురుస్తున్న వానలకు మియాపూర్, మదీన గూడ, దీప్తీ శ్రీనగర్ నీటిలో మునిగాయి. నాలాల మీద అక్రమ నిర్మాణాలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెప్తున్నారు. దీంతో నాలాల కబ్జాపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది GHMC . ఎలాంటి చిక్కులు రాకుండా అక్రమ కట్టడాలను కూల్చేందుకు రెడీ అయ్యారు.
వానకాలం వస్తే చాలు… నాలాల్లో మురుగు నీరు సరిగా పోకపోవడంతో.. రోడ్ల మీదకి , ఇండ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో సిటీ జనం వానాకాలం తిప్పలు పడ్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిటీలో చాలా కాలనీలు మునిగాయి. మియాపూర్, మదీనగూడ, దీప్తి శ్రీనగర్ కాలనీలు చెర్వుల్లా మారాయి. అయితే ఇక్కడ ప్రధానంగా నాలాలు కబ్జా కావడంతోనే .. ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెప్తున్నారు. ఇక గ్రేటర్ హైద్రాబాద్లో 173 ప్రధాన నాలాలున్నాయి. వీటి మీద సర్వే చేయగా, 12 వేల 182 అక్రమ కట్టడాలున్నట్లు బల్ధియా అధికారులు లెక్క తేల్చారు. వీటిని కూల్చడానికి బల్ధియా అధికారులు సమాయత్తమవుతున్నారు. మొత్తం 842 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు.
నాలాల మీద నిరుపేదలు ఇండ్లు కట్టుకొని ఉంటే.. వాటిని తొలగించి వాళ్లకి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని చూస్తోంది బల్ధియా. ఇదే విషయం మీద ప్రభుత్వానికి లేఖ రాశామనీ.. సర్కార్ ఒప్పుకుంటే .. అక్రమ నిర్మాణాలను తొలిగిస్తామని చెప్తున్నారు. నాలాల మీద నిర్మాణాల్లో ఎక్కువగా కూకట్ పల్లి సర్కిల్ లో వుంటే.. తక్కువగా కుత్బుల్లాపూర్ లో ఉన్నట్లు గుర్తించారు అధికారులు. మధీనగూడ, దీప్తీ శ్రీనగర్ కాలనీల్లో అక్రమ నిర్మాణాల మీద నోటీసులు జారీచేసినట్లు చెపుతున్నారు GHMC అధికారులు.