నాలుగు ఒప్పందాలపై భారత్- షీషెల్స్ సంతకాలు
మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఇవాళ షీషెల్స్ లో పర్యటిస్తున్నారు. ఆయనకు షీషెల్స్ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. షీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ అలిక్స్ మైచెల్ తో సమావేశమైన మోడీ.. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలపై చర్చించారు. అనంతరం సముద్ర రవాణా, ద్వైపాక్షిక ఒప్పందం, సాంప్రదాయేతర విద్యుత్, మౌళిక వసతుల వినియోగంపై ఒప్పందాలు కుదిరాయి. షీషెల్స్ అధ్యక్షుడితో సమావేశం ముగిసిన తర్వాత మోడీ మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని, రక్షణ పరమైన సహకారం ఇప్పటికే బలంగా ఉందన్నారు. షీషెల్స్ పౌరులకు మూడు నెలల ఉచిత వీసా సౌకర్యం కల్పిస్తామన్నారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన కోస్టల్ సర్వేలైన్స్ రాడార్ ప్రాజెక్ట్ ను మోడీ ప్రారంభించారు.