నాలుగు వేల ఏళ్లనాటి పిరమిడ్‌ ధ్వంసం

లిమా: పెరూ దేశంలో నాలుగువేల ఏళ్లక్రితం నిర్మించిందిగా భావిస్తున్న ఎల్‌ పరైసో అనే పిరమిడ్‌ స్థిరాస్తి వ్యాపారుల అత్యాశకు కుప్పకూలిపోయింది. రెండు స్థిరాస్తి సంస్థలకు చెందిన వాహనాలు గత వారాంతంలో ఒక పిరమిడ్‌ను ధ్వంసం చేశాయని, పక్కనే ఉన్న మరో మూడిటిని కూడా నాశనం చేయబోగా స్థానికులు అడ్డుకున్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. పెరూ చరిత్రకు జరిగిన ఘోర నష్టంగా వారు దీనిని అభివర్ణించారు. 4వేల ఏళ్లనాటి కట్టడం ఇప్పటివరకూ పర్యాటకులను అకర్షిస్తూ ఉండేదని, దాన్నిఆ ఎలా కట్టారో, ఎందుకు కట్టారో తెలియదని, వ్యాపారస్తుల నిర్లక్ష్యం వల్ల దేశానికి పూడ్చలేని నష్టం సంభవించిందని ప్రభుత్వాధికారులు పేర్కొన్నారు. బాధ్యులైన సంస్థలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.