నా ఫోన్‌ ఎలా ట్యాప్‌ చేస్తారు?

2
హైదరాబాద్‌పై నాకూ హక్కుంది

గుంటూరు,జూన్‌8(జనంసాక్షి): ఓటుకు నోటు వ్యవహారంపై ఎపి సిఎం చంద్రబాఉబ తీవ్రంగతా

స్పందించారు. ఇదంతా కెసిఆర్‌ కుట్రని అభివీర్ణించారు. తాను గనుక కన్ను తెరిస్తే జాగ్రత్త అంటూ తెలంగాణ సిఎం కెసిఆర్‌కు చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్ర కేసులు పెడితే పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. మంగళగిరిలో సంకల్పదినోత్సవంలో చంద్రబాబు ఆవేశంగా మాట్లాడుతూ తానూ ఒక సిఎం నని తనకూ అధికారులు, పోలీసులు, ఎసిబి ఉన్నాయని అన్నారు. మహాసంకల్ప దినోత్సవాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేశారని అన్నారు. ఎన్టీఆర్‌ గుండె ధైర్యం తనకు తోడుగా ఉందన్నారు.  అసమర్థ కెసిఆర్‌ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. అవసరం వస్తే తనవద్ద ఉన్న ఒక్కో అస్త్రాన్ని వదులుతానన్నారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అని, నీకెంత అధికారం ఉందో తనకూ పదేళ్ల వరకు అంతే అధికారం ఉందన్నారు. తన ఫోన్లను ట్యాపింగ్‌ చేసి కుట్రరాజకీయాలకు తెరదీస్తే భయపడేది లేదన్నారు. టిడిపి ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా ఫామ్‌ హౌజ్‌కు  తీసుకకుని వెళ్లి  కొనుగోలు చేసి తనపై కుట్రలు చేస్తారా అని మండిపసడ్డారు. రేవంత్‌ రెడ్డిని కుట్ర కేసులో ఇరికించారన్నారు. మన ఆత్మగౌరవాన్ని కెసిఆర్‌ దెబ్బతీసారాని, హైదరాబాద్‌లో ఆంద్రావారి ఇళ్లు కూల్చారని ఆరోపించారు. కెసిఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ధృఢ సంకల్పంతో కడవరకు నిలబడదాం అని   చంద్రబాబునాయుడు ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘మహా సంకల్పం’ పేరుతో ఏర్పాటు చేసినభారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తూ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ తనను ఏవిూ చేయలేక కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.  ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల అధికారాలు గవర్నర్‌కే ఉండాలని ఆయన పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీని ఏమైనా చేయాలనుకుంటే అది సాధ్యం కాదని ఆయన హెచ్చరించారు.  తాను కేసీఆర్‌కు సర్వంట్‌ను కాదని, తన ఫోన్‌లను ట్యాప్‌ చేయడం నేరం అని, ద్రోహం అనీ ఆయన చెప్పారు. ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా ఇస్తానని ఆయన చెప్పారు. తనను ఏవిూ చేయలేరని ఆయన చెప్పారు, అధికారంలో ఉన్నామని ఫోన్‌ ట్యాపింగ్‌లు చేస్తూ, స్టింగ్‌ ఆపరేషన్‌లు చేస్తూ నీచాతినీచానికి పాల్పడుతున్నారని ఆయన ఎండగట్టారు. ఇది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అన్నారు. ఇందుకు ప్రజలు చప్పట్లతో వ్యతిరేకించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించిన విూడియా వారి కేబుల్స్‌ కత్తిరిస్తున్నారని, ఇది ఆక్షేపణీయమని ఆయన అన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన ఒక నాయకుడు తన గురించి మాట్లాడుతున్నారని ఆయన వైసీపీ నాయకుడు వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను నీతి నిజాయితీలతో బ్రతికానంటూ తాను ఎవ్వరికీ భయపడేది లేదని ఆయన చెప్పారు. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర చేసుకుందామని అన్నారు. రాష్ట్రాన్ని త్వరలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. తెలుగువారు గర్వపడే ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌ అని, తెలుగుజాతి ఉన్నంత వరకు ప్రజల హృదయాల్లో ఆయన ఉంటారని అన్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు పునరంకితం కావటానికి సభకు వచ్చామన్న చంద్రబాబు… ఇదే ప్రాంగణంలో యువ గర్జన ద్వారా అవినీతి కాంగ్రెస్‌పై గర్జించామని, ఇదే ప్రాంగణంలో తాను ప్రమాణ స్వీకారం చేశానని తెలిపారు. అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని  స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం అశోక్‌బాబు ఎంతో గొప్పగా పోరాటం చేశారని కొనియాడారు. ఎన్టీఆర్‌ సుజల స్రవంతిని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్‌ మిగులు విద్యుత్‌ సాధించిందన్నారు. 36శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, అయినా తెలంగాణ కంటే 2శాతం అధిక వ్యవసాయోత్పత్తి సాధించామని తెలిపారు. ఇంగితజ్ఞానం లేని కాంగ్రెస్‌

అధినేత్రి సోనియా భూసవిూకరణ తప్పు పట్టారన్నారు. ఎన్నో కేసుల్లో ఉన్న కుట్రల పార్టీ వైకాపాను వదిలిపెట్టమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. తెరాసతో కలిసి వైకాపా కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేసి విభజన చేయమని అడిగామని, రాజధాని ఎక్కడో చెప్పకుండా విద్వేషాలు రెచ్చగొట్టారని విమర్శించారు. రాజధాని విషయంలో కాంగ్రెస్‌ నీచ రాజకీయం చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటామని చంద్రబాబునాయుడు అన్నారు. ‘మహా సంకల్పం’ సభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీని భారతదేశంలో మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. తన విూద నమ్మకంతో ఓటేసిన ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని హావిూ ఇచ్చారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తి తన దగ్గర ఉందని, కష్టపడి పనిచేయడం తన నైజం అని చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు.

రాష్ట్రాన్ని టెక్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, అందరికీ అందుబాటులోకి ఇంటర్నెట్‌ తీసుకొస్తామని హావిూ ఇచ్చారు. ఇంటర్నెట్‌ను ప్రతీ ఇంటికి అందిస్తామని దాని ద్వారా బాలకృష్ణ కొత్త సినిమాలను నేరుగా ఇంట్లో కూర్చుని చూడవచ్చంటూ చంద్రబాబు చిరునవ్వులు చిందించారు. అంతేకాకుండా ఇంటర్నెట్‌ ద్వారా మగవారు వంట చేసుకునే వెసులుబాటు ఉందని, త్వరలోనే ఆ పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.

విభజన వల్ల వచ్చిన ఇబ్బంది, ఆ సమయంలో జరిగిన అన్యాయం, కాంగ్రెస్‌ తీరు, అవమానించిన విధానం ఎప్పుడూ మర్చిపోలేమని  అన్నారు. విభజన ఒక పీడకల అని, రాష్టాన్న్రి అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితమైందని చెప్పారు. సోనియాగాంధీ తెలుగు ప్రజల పొట్టను కొట్టిందని ఆరోపించారు. ఇటలీ స్వాతంత్య్రం రోజే తెలుగు రాష్ట్రాన్ని విభజించారని చెప్పారు. అయినా బుల్లెట్‌ లా దూసుకెళతాం తప్ప వెనక్కి తిరిగి చూసే సమస్యే లేదని అన్నారు. ఈ సభ సందర్భంగా ఆంధప్రదేశ్‌ అభివృద్ధికి కృషిచేద్దామని సంకల్పించాలని కోరారు. కాగా, టీఆర్‌ఎస్‌ పార్టీ తో చేయి కలిపి వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తుందని వారిని వదిలిపెట్టేది లేదని చెప్పారు. జూన్‌ 2 వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్‌ కు అన్యాయం జరిగిన రోజుగా గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటానని, వాటికి విూ ఆశీస్సులు కావాలని సభకొచ్చిన ప్రజలనుద్దేశించి అన్నారు. ఎన్టీఆర్‌ గొప్ప నాయకుడని ఆయన వద్ద శిక్షణ పొందిన తాను తెలుగు అమరావతి నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇక్కడి ప్రజానీకం చాలా తెలివైన వారని వివరించారు. అన్ని చోట్ల రాణిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో కరువు పోవాలంటే గోదావరి నీళ్లు కావాలని, పోలవరం పూర్తి చేస్తామని హావిూ ఇచ్చారు. తనకు విజన్‌ ఉందని గుర్తించే ఓటు వేశారని, ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని అన్నారు. ప్రపంచం మనవద్దకు వచ్చేలా తయారు చేస్తా అని చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చినవారిని మర్చిపోలేమని అన్నారు.