నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం
– అఖ్లక్ కుటుంబసభ్యులకు అఖిలేష్ భరోసా
లక్నో అక్టోబర్ 04 (జనంసాక్షి):
దాద్రి ఘటనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. దాద్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అఖ్లాక్ ముగ్గురు కుటుంబ సభ్యులు ఇవాళ అఖిలేష్‌ను తన అధికార నివాసంలో కలిసిన సందర్భంగా ఈ హావిూ ఇచ్చారు. కాగా, ఆవు మాంసం తిన్నారని ఆరోపిస్తూ కొందరు దుండగులు దాద్రిలో ఓ ముస్లిం కుటుంబంపై దాడి చేశారు. ఈ దాడిలో కుటుంబంలోని అఖ్లాక్ మృతిచెందగా ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
యూపీలోని దాద్రి దుర్ఘటనపై అన్ని పార్టీలు పోటీపడి రాజకీయం చేస్తున్నాయి. గోమాంసం తిన్నాడన్న కారణంగా ఇటీవల దాద్రి పట్ణణంలో కొందరు దుండగులు మహ్మద్‌అఖ్లక్ ను కొట్టి చంపారు. దీంతో, బీజేపీ మత రాజకీయాలవల్లే ఈ దుర్మార్గం జరిగిందని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అటు బీజేపీ మాత్రం ప్రతిపక్షాలు ఈ దుర్ఘటనపై అనవసర రాజకీయం చేస్తున్నాయని విమర్శిస్తోంది. ఇదిలావుంటే అఖ్లక్ కుటుంబసభ్యులు ఇవాళ ఉదయం ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేశ్ ను కలిసి? తమకు న్యాయం చేయాలని కోరారు.
బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ దాద్రికి వెళ్లి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఘటనకు సంబంధించి వినయ్ అనే ¬ంగార్డ్ ను అదుపులోకి తీసుకున్నట్లు యూపీ పోలీసులు తెలిపారు.