నిఖిల్ హత్య కేసును ఛేదించాలి

– టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి) : నిఖిల్ హత్య కేసును వెంటనే ఛేదించాలని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.కాంగ్రెస్ నాయకులు ధరావత్ భాస్కర్ కుమారుడు ధరావత్ నిఖిల్ ఈనెల 9న ఫ్రెండ్స్ బర్త్ డే పార్టీలో పాల్గొని, ఇంటికి వెళ్ళకుండా రెండు రోజుల తర్వాత చిలుకూరు మండలంలోని కాలువలో మృతదేహంగా లభించిన నిఖిల్ హత్య కేసు అలసత్వంపై ఆయన పలు అనుమానాలను వ్యక్తం చేశారు.కేసును తప్పు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు.సిబిసిఐడిచే కేసును విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కేసు వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు.ఇన్ని రోజులవుతున్న కేసు కొలిక్కి రాలేదని,గిరిజనుల పట్ల చిన్నచూపు చూస్తున్నట్లు అర్థమవుతుందన్నారు.మంత్రి జగదీష్ రెడ్డి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు గోదాల రంగారెడ్డి, బంటు చొక్కయ్య గౌడ్ , గట్టు శ్రీనివాస్, నామా ప్రవీణ్ , వల్దాస్ దేవేందర్, సంజయ్ పాల్గొన్నారు.
Attachments area