నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ స్వాధీనానికి సర్కారు నిర్ణయం

2

హైదరాబాద్‌:తెలంగాణలోని చక్కెర కర్మాగారాలను రైతులపరం చేసేందుకు సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బోధన్‌ లోని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సహకార రంగంలో రైతుల ఆధ్వర్యంలో ఫ్యాక్టరీని నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. మూడు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కమిటీని ఆదేశించారు. చక్కెర కర్మాగారాల నిర్వహణపై అధ్యయనం చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం ఆధ్వర్యంలో రైతుల బృందం మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఇప్పటికే పర్యటించింది. గత ప్రభుత్వాలు దివాళా తీయించిన పరిశ్రమలను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఏడాదిగా మూతపడ్డ వరంగల్‌ జిల్లా కమలాపురంలోని రేయాన్స్‌ పరిశ్రమను తెరిపించేందుకు భారీ రాయితీలు, హావిూలు ఇచ్చారు.