నిజామాబాద్‌ను వీడని వర్షం
వర్షాల ధాటికి పొంగిపొర్లుతున్న వాగులు
50కి పైగగా ప్రాంతాల్లో నిలిచిన రాకపోకలు
నిజామాబాద్,జూలై14(జనం సాక్షి): జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు 30 గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. జిల్లాలో సుమారు 50కి పైగా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 27,802 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 19,980 ఎకరాల్లో వరి, 5,251 ఎకరాల్లో సోయాబిన్, 2,383 ఎకరాల్లో మొక్కజొన్న, 188 ఎకరాల్లో పత్తి, 4,608 ఎకరాల్లో వరి నారుమడులు దెబ్బతిన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలో ఈ వర్షాలకు ఇప్పటి వరకు 417 ఇళ్లు పాక్షికంగా, 11 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 50కి పైగా రోడ్లపై నీళ్లు పారుతుండగా ఇప్పటి వరకు 16 రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. జిల్లాలో మొత్తం 1067 చెరువులు ఉండగా 944 చెరువులు పూర్తిగా నిండి మత్తడులు పారుతున్నాయి. ఇప్పటి వరకు 150 వరకు పోల్స్, 18 ట్రాన్స్‌ఫార్మర్‌లు దెబ్బతిన్నట్లు ట్రాన్స్‌కో అధికారులు వెల్లడిరచారు. మొత్తంగా ఎడతెరపి లేకుండా కుర్తున్న భారీ వర్షాలకు జిల్లా విలవిలలాడుతోంది. జిల్లాలోని వాగులు పొంగుతున్నాయి. మంజీరా, గోదావరి నదులు పోటెత్తుతున్నాయి. భారీ వర్షాలకు నగరంతో పాటు పలు మండల్లాలోని సుమారు 30 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి తీర ప్రాంత ప్రజలు భయంలో గుప్పిట్లో గడుపుతున్నారు. వర్ని మండలంలోని తగిలేపల్లి గ్రామంలో బుధవారం రాత్రి గోడకూలి నిద్రిస్తున్న రాజమణిపై పడడంతో మృతిచెందింది. పలుచోట్ల రహదారులు కోతకు గురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చాలా గ్రామాలకు బాహ్య
ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. అనేకచోట్ల చెరువులకు గండ్లు, కూలిన ఇళ్లతో భారీ నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 27802 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. జిల్లాలో సుమారు 50కి పైగా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా వరద ప్రధాన రహదారుల నుంచి వెళ్తుండడంతో గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు జిల్లాలో పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. జిల్లాలో పడుతున్న భారీ వర్షాలతో యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌తో పాటు పలు కార్యాలయాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టారు. వరద నీరు చేరిన ప్రాంతాల వారిని పునరావాస ప్రాంతాలకు తరలించారు. జిల్లాలో 19980 ఎకరాల్లో వరి, 5251 ఎకరాల్లో సోయాబిన్, 2383 ఎకరాల్లో మొక్కజొన్న, 188 ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇవే కాకుండా నారుమడులు 4608 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ పంటలే కాకుండ వేలాది ఎకరాల్లో పంటలు నీటిలో మునిగాయని ప్రభుత్వానికి పంపిన నివేదికలో వ్యవసాయ అదికారులు పేర్కొన్నారు. జిల్లాలో ఈ వర్షాలకు ఇప్పటి వరకు 417 ఇళ్లు పాక్షికంగా, 11ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలో 50కి పైగా రోడ్లపై నీళ్లు పారుతుండగా ఇప్పటి వరకు 16రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రభుత్వానికి పంపించిన నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 1067 చెరువులు ఉండగా 944 చెరువులు పూర్తిగా నిండి మత్తడులు పారుతున్నాయి. జిల్లాలో మిగతా చెరువులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాలకు పలుచోట్ల చెట్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిరది. నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా అంతరాయం ఏర్పడడంతో వాటిని తీసివేసి విద్యుత్ పునరుద్ధరించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడం వల్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకి రావద్దని కోరారు. లోతట్టు
ప్రాంతాలు, వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల నుంచి రాకపోకలను నిషేధించాలని అవసరమైతే పోలీసుల సహాకారం తీసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన సూచించారు.