*నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది వినోద్
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో గురువారం మిడ్ నైట్ ద్విచక్ర వాహనంపై తుమ్మనపల్లి నరేష్ 32 సంవత్సరాలు అను వ్యక్తి కోరుట్ల నుండి రాయికల్ వెళ్తుండగా మద్యం మత్తులో బైక్ అదుపుతప్పి కింద పడడంతో తీవ్ర గాయాలు అయినాయి అక్కడ ఉన్న స్థానికులు 108 కి సమాచారం అందించగా కోరుట్ల 108 సిబ్బంది పోతారం వినోద్ నాయక్ హటాహుటీన సంఘటన స్థలాన్ని చేరుకొని అతన్ని అంబులెన్స్ లో తీసుకొని కోరుట్ల ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. అనంతరం అతని దగ్గర ఉన్నటువంటి బంగారు అభరణాలు మరియు 28,000 రూపాయలు వాళ్ళ కుటుంబ సభ్యుడు అయినటువంటి దాసరి సతీష్ కుమార్ కు అందించడం జరిగింది. నిజాయితీ చాటుకున్నందుకు 108 సిబ్బంది పోతారం వినోద్ ను జడ్పిటిసి నాగం భూమయ్య ,సర్పంచ్ ధర్మపురి జలంధర్ , వినోద్ ను అభినందించారు,వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అలాగే కోరుట్ల108 సిబ్బంది అయినటువంటి ఈఎంటి వినోద్, పైలట్ మల్లారెడ్డి లకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ షేక్ సలీం ,జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ సంపత్, ప్రణీత్ రెడ్డి లు అభినందించారు.