నితీష్‌కు ఓటు వెయ్యండి
– మద్ధతు లేదన్నది తప్పుడు వార్త
– కేజ్రీవాల్
న్యూఢిల్లీ అక్టోబర్1(జనంసాక్షి): బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పూర్తి మద్దతు ప్రకటించారు. నితీశ్ కు ఓటు వేయాలని బిహార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నా ప్రకటనను కొన్ని విూడియా సంస్థలు వక్రీకరించాయి. నా పూర్తి మద్దతు నితీశ్ కుమార్ కు ప్రకటిస్తున్నా. ఆయన మంచి మనిషి. ఆయనకే ఓటు వేయాలని బిహార్ ప్రజలను కోరుతున్నాడ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోదని, ఎన్నికల ప్రచారానికి వెళ్లబోనని కేజ్రీవాల్ చెప్పినట్టు విూడియాలో బుధవారం వార్తలు వచ్చాయి. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోఆప్‌కు జేడీ(యూ) మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. వారణాసిలో నరేంద్ర మోదీపై పోటీ చేసిన కేజ్రీవాల్ కు జేడీ(యూ) అండగా నిలిచింది.