నితీష్‌.. ఫేస్‌ బుక్‌లో ఫేస్‌ టూ ఫేస్‌

2
పట్నా అక్టోబర్‌ 11 (జనంసాక్షి):

అసెంబ్లీ ఎన్నికల్లో ¬రా¬రీగా తలపడుతున్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఓటర్లను ఆకర్షించడానికి వీలున్న ఆ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. మరికొది

గంటల్లో తొలిదఫా  పోలింగ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో తనను ఉద్దేశించి వివిధ వర్గాలు ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన స్వయంగా సమాధానం చెప్పారు.

ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సీఎం నితీశ్‌ జవాబు ఇస్తూ.. ”రాజ్యాంగం ఆధారంగా దేశంలో పాలన సాగుతున్నది. కులం ప్రతిపాదికగా కొన్ని చర్యలు తీసుకునేందుకు రాజ్యాంగం వీలు కల్పిస్తున్నది. ఎంతో చర్చించి, ఎంతో శ్రద్ధతో ఈ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ వ్యవస్థ ఉందని నా అభిప్రాయం. అదేసమయంలో ఆర్థికంగా వెనుకబడిన వారందరి అభ్యున్నతి, సమ్మిళిత అభివృద్ధి కోసమే నేను పాటుపడుతున్నాను’ అని ఆయన తెలిపారు.జేడీయూ అధినేత అయిన నితీశ్‌ ఆర్జేడీ, కాంగ్రెస్‌తో

జతకలిసి మహాకూటమిగా ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ప్రధాన ప్రత్యర్థి ఎన్డీయేపై పైచేయి కోసం ప్రయత్నిస్తున్న ఆయన బీహార్‌ అభివృద్ధి కోసం తమ కూటమి ప్రవచిస్తున్న ఏడు సూత్రాలను మరోసారి ఫేస్‌బుక్‌ యూజర్లకు వివరించారు.