నిమ్స్‌ని సందర్శించిన నగర మేయర్
హైదరాబాద్,సెప్టెంబర్24 జనం సాక్షి : పంజాగుట్ట నిమ్స్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలను నగర మేయర్ బొంతు రామ్మోహన్, నిమ్స్ డైరెక్టర్ కే మనోహర్, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి కలిసి ఇవాళ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా నిమ్స్ ఆవరణలో ఉన్న పూల కుండీలు, నీటి నిల్వలను మేయర్ తొలగించారు. అనంతరం మేయర్ విూడియాతో మాట్లాడుతూ.. డెంగీ నివారణలో భాగంగా నగరంలో ఫాగింగ్, స్పిం/-రగ్‌లను రెట్టింపు చేశామని తెలిపారు. పాఠశాలల్లో ఫాగింగ్‌తో పాటు డెంగీ, సీజనల్ వ్యాధుల నివారణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మేయర్ చెప్పారు.