నియంత్రణ ఆపరేషన్ వికటించి మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి

బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు జి మణికుమార్

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 1 : ఇబ్రహీం పట్టణంలోకుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించి తక్షణమే బాధ్యత కుటుంబాలను ఆదుకోవాలని బిఎస్పీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జి. మణికుమార్, మండల కన్వీనర్ పేరపోగు తిరుపాల్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బీఎస్పీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరైన వసతులు కల్పించడం లేదని మండిపడ్డారు. కొత్తగా నిర్మించిన బస్తీ దవఖానాలలో సైతం కనీస సౌకర్యాలు కొరవడి నాయన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి భాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషీయ ప్రకటించి బాధిత కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.