నియోజకవర్గం లో ప్రతి కుటుంబానికి అండగా ఉంటా  – టిపిసిసి సభ్యులు మాలోతు నెహ్రు నాయక్   

సిరోల్ నవంబర్-10 (జనం సాక్షి న్యూస్)       డోర్నకల్ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని టిపిసిసి సభ్యులు మాలోత్ నెహ్రూ నాయక్ అన్నారు.గురువారం సీరోల్ మండలం కొర్లకుంట తండా గ్రామ మాజీ ఉప సర్పంచ్ బానోత్ సురేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని బాదిత కుటుంబానికి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన డోర్నకల్ నియోజకవర్గ బాధ్యులు,టీపిసిసి సభ్యులు మలోత్ నెహ్రూ నాయక్.వారి వెంట సీరోల్ మండల నాయకులు,గుగులోతు లాలూ నాయక్ డీస్ జగదీశ్,గుగులోతు నరేష్,కళ్యాణ్,సురేష్ కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.