నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మక్తల్ ci సీతయ్య
మక్తల్ ఆగస్టు 31(జనంసాక్షి) మక్తల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజలకు మక్తల్ ci సీతయ్య వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా.. భక్తిశ్రద్ధలతో హిందువులు గణనాథుడిని ఆరాధిస్తారని ci సీతయ్య అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని వారు కోరారు.
గణనాధుని ఆశీసులు అందరిపై ఉండాలని,
అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు.11రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక చవితి ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు.