నిరంతరం వైద్య పరీక్షలు చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి…

-చెల్మెడ లక్ష్మి నరసింహ రావు
వేములవాడ గ్రామీణం, అక్టోబర్ 10 (జనంసాక్షి):
ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంటుందని, మనుషులు ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని చల్మెడ ఆనంద రావు వైద్య విజ్ఞాన సంస్థల చైర్మన్ చల్మెడ లక్ష్మీ నరసింహా రావు పేర్కొన్నారు. జిల్లా వికాస తరంగిణి, చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థలు కరీంనగర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ గ్రామంలో తమ వైద్య సిబ్బంది 1179 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. దేవుడిచ్చిన శక్తితో ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం సేవా చేస్తానన్నారు. అనంతరం గ్రామానికి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు,గ్రామస్తులు చల్మెడకు పుష్పగుచ్చం అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, జడ్పీటీసీ ఏశ వాణి-తిరుపతి, బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోస్కుల రవి, ఏఎంసి వైస్ చైర్మన్ బాల్ రెడ్డి, సర్పంచులు పెండ్యాల తిరుపతి, మల్లేశం, జైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ చంద్రయ్య, నాయకులు పెండ్యాల శంకర్,అంజనీ కుమార్, సోమినేని బాలు, ఈర్యా నాయక్ లతో పాటు అన్ని కుల సంఘాల అధ్యక్షులు, వార్డు సభ్యులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.