నిరాహార దీక్ష చేస్తున్న ఆశా కార్యకర్తలు

టేకులపల్లి, అక్టోబర్ 7( జనం సాక్షి ): 13వ రోజు ఆశా వర్కర్ల సమ్మె లో భాగంగా శనివారం ఆశా కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నదని, కానీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి సేవలు అందించే ఆశా వర్కర్ల కు కనీస వేతనం ఇవ్వకుండా పీ ఎఫ్, ఈ ఎస్ ఐ,ఇన్సూరెన్స్, ఉద్యోగ భద్రత కల్పించ కుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆశా వర్కర్లు గత పదమూడు రోజులుగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేస్తున్నారు. అందులో భాగంగా నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఆశా వర్కర్ల జిల్లా నేత మజహరి,విజయ,హైమ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమతో వెట్టి చాకిరి చేపిస్తుందని అన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగుతుందని, ప్రభుత్వం స్పందించకుంటే దశలివారీగా సమ్మెను ఉధృతం చేస్తామని వారి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హైమావతి, చంద్రకళ,లక్ష్మీ విజయ రాధ, రాణి,నాగలక్ష్మి, వసంత, పద్మ, సుజాత,వెంకట రమణ,అరుణ, కుమారి తదితరులు పాల్గొన్నారు.