నిరుద్యోగులకు కాంగ్రెస్ అండ

కెసిఆర్ కుటుంబ పెత్తనాన్ని నిలువరించండి
ప్రచారంలో శ్రీధర్ బాబు పిలుపు
మంథని,నవంబర్28(జనంసాక్షి): నిరుద్యోగులకు అండగా ఉండేది కాంగ్రెస్ మాత్రమేనని మహాకూటమి అభ్యర్థి,మాజీమంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి నిరుద్యోగులను తెరాస మోసం చేసిందన్నారు. మాటవిూద నిలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. తెరాస హయాంలో జరిగిన బ్యాంకు రుణమాఫీ కేవలం వడ్డీలకే పరిమితమైందన్నారు. ఓట్ల కోసం వచ్చే తెరాస నాయకులను గ్రామాల్లో నిలదీయాలన్నారు. తెరాస, భాజపా అభ్యర్థుల మోసపూరిత మాటలను నమ్మవద్దని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మీ, రైతుబంధు పథకాలు నిలిపివేస్తామని తెరాస నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 58 ఏళ్లు నిండిన వృద్ధులకు నిబంధనలు లేకుండా అందరికి పింఛన్ అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రణాళికను ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉండి పనిచేసే తనను దీవించాలని ఓటర్లను అభ్యర్థించారు. తెరాస పార్టీ దోపిడీ నాయకుల పార్టీగా మారిందని, సొంత పార్టీ నాయకులనే దోచుకుంటున్న ఘనత ఆ పార్టీకే దక్కిందని అన్నారు. తెరాస పార్టీకి కాలం చెల్లిందని, ఆ పార్టీ చేసిన అవినీతి అక్రమాలకు ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హావిూని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. ఇంటికో ఉద్యోగం పేరుతో యువతను మోసం చేసి కేసీఆర్ ఇంట్లో మాత్రం నాలుగు పదవులు సంపాదించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు, నిరుద్యోగ భృతి రూ.3,000లు, 59 ఏళ్లు నిండిన అర్హులైన వారందరికీ పింఛనులు అందజేస్తామన్నారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పు మరోసారి జరగొద్దని కారు పార్టీకి అవకాశమివ్వద్దని.. విజ్ఞత, ఆలోచనలతో ఓటు వేసి మెరుగైన ప్రజాసేవ చేసేలా కూటమికి అధికారం అప్పగించాలని కోరారు. నీళ్లు.. నిధులు.. నియామకాలు అని ఉద్యమ సమయంలో ప్రజల భావోద్వేగాల్ని రెచ్చగొట్టి హావిూలు ఇచ్చారని..ఇందులో ఏది నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం వచ్చి
తెరాస వాళ్లు వచ్చి ఏమిచ్చినా తీసుకొని ఓటు మాత్రం విచక్షణతో ఆలోచించి వేయాలని ఆయన కోరారు. ప్రజలు ఆత్మగౌరవంతో ఓటేస్తే అది ఐదు సంవత్సరాలు మన జీవితాలను శాసిస్తుందనే అలోచించాలని సూచించారు. ఈ 50 నెలల్లో తెరాస పాలనలో అప్పుల ఊబిలో ముంచిన ఘనత తెరాసదేనని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రజల సమస్యల్ని తీరుస్తుందని..2లక్షల రూపాయల రుణమాఫీతోపాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాలు చేపడుతామని మహిళలలకు రూ.10లక్షల వరకు రుణాల్ని అందిస్తామని ఆయన హావిూ ఇచ్చారు.



