నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త


వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలకు హావిూ
సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట
న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):  నిరుద్యోగ యువతకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గూడ్‌ న్యూస్‌ చెప్పారు. దేశంలో వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. మేకిన్‌ ఇండియా ఈ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నిర్మల బడ్జెట్‌ ప్రసంగంలో నాలుగు రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాని గతిశక్తి యోజన, సవిూకృత అభివృద్ధి, ఉత్పాదక అభివృద్ధి, ఆధారిత
పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతమివ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్స్‌ప్రెస్‌ వే కోసం గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌, 25 వేల కిలోవిూటర్ల హైవేల విస్తరణ చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. చిరుధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం ఇస్తామన్నారు. 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిపీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహిస్తామన్నారు. కేంద్ర బ్జడెట్‌ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా సేంద్రీయ ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్జడెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. చిరుధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లుగా వెల్లడిరచారు.వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి చేస్తామన్నారు. పీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహిస్తామని పేర్కొన్నారు. సహజ, సేంద్రీయ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయం అవసరాలను తీర్చడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిలబస్‌లను సవరించాలని రాష్టాల్రకు సూచిస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.