నిరుద్యోగ నిర్మూలనే జగనన్న లక్ష్యం

 

నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి

విశాఖపట్నం ఫిబ్రవరి 18:- నిరుద్యోగ నిర్మూలనే జగనన్న లక్ష్యమని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. శుక్రవారం ఆమె 2వ జోన్ 9 నుండి 13వ వార్డులలోని ఖాళీగా ఉన్న 52 వాలంటరీ ఉద్యోగాల కు అభ్యర్థులను ఎంపిక చేసి వారికి నియామానికపత్రాలను అందించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వేలాదిగా వార్డు, గ్రామ కార్యదర్శులు, వాలంటీర్ల నియామానికం చేశారని, త్వరలోనే కార్యదర్శులు అందరికీ ప్రొఫెషన్ డిక్లేర్ చేసి శాశ్వత ఉద్యోగులుగా పరిగణింపచేస్తున్నారని, అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలు నేరుగా అర్హులైన ప్రజల వద్దకే చేరాలనే ఉద్దేశంతో వాలంటీర్లు నియమించి వారి ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. 9 నుండి 13 వార్డులలో ఖాళీగా ఉన్న వాలంటరీ పోస్టులను నియమించి వారికి నియమానికి పత్రాలను అందించామని తెలిపారు. నాడు పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి పార్టీలకతీతంగా ఆయా కుల వృత్తుల వారికి, ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా పైకి తీసుకు రావాలని ఉద్దేశంతో ఆర్థిక సహాయం చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ అక్రమాని విజయనిర్మల, కార్పొరేటర్లు కోరుకొండ వెంకటరత్న స్వాతి, మద్దెల రామలక్ష్మి, అక్రమాని రోహిణి, కెల్లా సునీత, వైయస్సార్సీపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు….