నిరుద్యోగ భారతం

1

368 ప్యూన్‌ ఉద్యోగాలకు 23 లక్షల దరఖాస్తులు

255 మంది పీహెచ్‌డీ అభ్యర్థులు

బీటెక్‌, ఎంఎస్సీ అభ్యర్థుల దరఖాస్తులూ బోలేడు

సెప్టెంబర్‌16(జనంసాక్షి):

దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో తెలుసా.. ఈ విషయం తెలుసుకోవాలంటే ఒక్కసారి ఉత్తరప్రదేశ్‌ వెళ్లి చూడండి. అక్కడ రాష్ట్ర సచివాలయంలో ప్యూన్‌ ఉద్యోగాలకు ఏకంగా 23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. లక్నో నగర జనాభా మొత్తం 45 లక్షలు కాగా, దాదాపు అందులో సగం మంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారన్నమాట. అక్కడితోనే అయిపోలేదు.. దరఖాస్తు చేసుకున్నవాళ్లలో సుమారు 2 లక్షల మంది కనీసం బీటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంకామ్‌ లాంటి డిగ్రీలు చేసినవాళ్లు. మరో 255 మంది దరఖాస్తుదారులకు అయితే పీహెచ్‌డీలు కూడా ఉన్నాయట.    ఈ వివరాలను సచివాలయంలోని పరిపాలనా విభాగం అందించింది. ప్యూను ఉద్యోగాలకు

ఇంత స్థాయిలో స్పందన రావడం చూసి తామే షాకయ్యామని ఆ శాఖ కార్యదర్శి ప్రభాత్‌ మిట్టల్‌ చెప్పారు. మొత్తం వీళ్లందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేయడానికి కనీసం రెండు సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. తనకు పీహెచ్‌డీ చేసిన ఉద్యోగం లేక ఖాళీగా తిరుగుతున్నానని, దానికంటే ప్యూను ఉద్యోగం చేయడం

నయమే కదా అని అలోక్‌ అనే అభ్యర్థి చెప్పాడు. చిన్నపని చేయడంలో తప్పేవిూ లేదని రతన్‌ యాదవ్‌ అనే మరో అభ్యర్థి అన్నాడు. ఎవరివిూదో ఆధారపడి బతికేకన్నా అధికారులకు మంచినీళ్లు ఇవ్వడం నయమనని రేఖావర్మ అనే అమ్మాయి చెప్పింది.