నిరుద్యోగ సమస్య పెరుగుతున్న తరుణంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
విజేత కళాశాల ప్రిన్సిపల్ తెడ్ల ధనుంజయ
మిర్యాలగూడ,జనం సాక్షి.
నిరుద్యోగ సమస్య పెరుగుతున్న తరుణంలో వచ్చిన అవకాశంలో సద్వినియోగం చేసుకొని యువత ముందుకు సాగాలని డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ తెడ్ల ధనుంజయ కోరారు. మంగళవారం కళాశాల ప్రాంగణంలో అపోలో ఫార్మసీ, అపోలో హాస్పిటల్ వారి ఏర్పాటు చేయబడ్డ జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఫార్మసీ, వైద్యశాల గురించి అవగాహన ఎంతో అవసరమన్నారు. సమాజంలో మంచి పేరు ఉన్న అపోలో ఫార్మసీ, హాస్పిటల్లో పనిచేస్తే కూడా సమాజంలో పేరు గౌరవం గుర్తింపు లభిస్తుందన్నారు.యువత ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు నిర్వహించిన జాబ్ మేళాలో 150 మంది విద్యార్థులు పాల్గొనగా 82 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఆయన తెలిపారు. జాబ్ మేళా కార్యక్రమం లో అపోలో ఫార్మసీ, వైద్యశాల ల హెచ్ ఆర్ రాజశేఖర్ రెడ్డి. పారా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ.మరియు సిబ్బంది పాల్గొన్నారు.