నిరుపయోగ భూ పంపిణీ తగదు: పిడమర్తి రవి

నల్లగొండ,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): పేదలకు పంచిన భూముల్లో సాగుకు అనుకూలంగా లేని వాటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తే పరిశీలిస్తామని ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు.
వ్వయసాయ యోగ్యమైన భూమినే పంచాలని ఆదేశాలు ఉన్నాయని అన్నారు.  నిరుపేదలైన ఎస్సీల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం భూపంపిణీకి ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా నిధి కేటాయించామని అన్నారు. సాగు చేసుకోలేని వారు తమ భూమిని అప్పగించాలని తద్వారా దళితులకున్యాయం జరుగుతుందని అన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వేల ఎకరాల భూ పంపిణీ చేసినట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు కార్పొరేషన్‌ తరఫున రాష్ట్రవ్యాప్తంగా స్వయం ఉపాధి కల్పనకు రూ.152 కోట్ల సబ్సిడీ అందజేసినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఇప్పటివరకు వందకోట్లు పైనే అందజేశామని తెలిపారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే పేద విద్యార్థులకు అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ ఫథకం ద్వారా ఆర్థికసాయం చేసినట్లు తెలిపారు. స్వయం ఉపాధికి అందిస్తున్న రాయితీని 80 శాతం నుంచి 90 శాతానికి పెంచుతామన్నారు.