*నిరుపేద కుటుంబానికి రూ.1 లక్ష ఎల్ఓసీ అందజేసిన నాగపూరి కిరణ్
దుల్మిట్ట (జనం సాక్షి )అక్టోబర్ 21 : దూల్మిట్ట మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన పోలోజు సంతోష్ కుమార్ గత కొన్ని రోజులుగా కాలుకు సంబందించిన వేరికోస్ వ్యాధితో బాధపడుతు వారిది నిరుపేద కుటుంబం కావడంతో కాలు ఆపరేషన్ కోసం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ కుమార్ ను సంప్రదించగా వెంటనే స్పందించిన కిరణ్ కుమార్ మంత్రి హరిష్ రావు దృష్టికి తీసుకెళ్లగా రూ.1,00,000 లక్ష రూపాయలు సిఎంఆర్ఎఫ్ఎల్ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబాన్ని ఎల్ఓసీ పత్రాన్ని శుక్రవారం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ కుమార్ అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, కిరణ్ కుమార్లకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్క కనుకయ్య,టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సరికొండ రాంరెడ్డి,పోలోజు బాపురాజు, ఉదయ్ కుమార్,రాజు తదితరులు పాల్గొన్నారు.
Attachments area