నిరుపేద ప్రతిభ విద్యార్థినీకి కాలేజి సీట్ ఇపించిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే

హుజూర్ నగర్ జులై   (జనం సాక్షి): హుజూర్ నగర్ లోని బురుగడ్డ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంభంలో పుట్టిన ప్రతిభావంతురాలు అయిన లికిత అనే విద్యార్థిని కి హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇంటర్ ఎంపిసీ లో బుధవారం సీట్ ఇప్పించడం జరిగిందన్నారు. లిఖిత అనే విద్యార్థినీ హుజర్నగర్ మండలం బురుగడ్డ గ్రామానికి చెందిన గడ్డం హుస్సేన్ కూతురు, హుస్సేన్ కి ముగ్గురు ఆడపిల్లలు అయితే లిఖిత కు చదువు మీద బాగా ఆసక్తి, ఉన్నత చదువులు చదువుకోవాలని బాగా కోరిక కానీ తండ్రి కి అంత ఆర్ధిక స్తోమత లేదు ఈ క్రమంలో వారు హుజూర్ నగర్  శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి ని కలిసి లిఖిత తనకు చదువుకోవాలని ఉంది అని , కానీ పేదరికం వలన ఆపేసే పరిస్తుతులున్నాయి అని కన్నీటి పర్యంతం అయినది, పాపలోని చదువు మీద ఉన్న తపన కోరిక ను చూసి, ఎమ్మెల్యే చదువు కు నేను మార్గం వేస్తాను అని భుజం తట్టి ధైర్యం చేప్పి, వెంటనే మోడల్  స్కూల్ లో మాట్లాడి వెంటనే ఆ పాపకు అడ్మిషన్ ఇప్పించడం  జరిగిందన్నారు. ప్రతిభ ఏ రంగంలో ఉన్న ప్రోత్సహిస్తున్న హుజూర్ నగర్  శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి నిరుపేదల పక్షపాతి గా నిలబడ్డారు.