నిరుపేద వృద్ధులకు అండగా నిలబడ్డ శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్ రాజపేట.
ములుగు జిల్లా
గోవిందరావుపేట సెప్టెంబర్ 2 (జనం సాక్షి):-
గోవిందరావుపేట మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని విషయం తెలుసుకున్న శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ గాంధీనగర్ గ్రామానికి వచ్చి గూగులొత్,భీమ్య (65) ఇంటిని చూసి చలించిపోయిన,బాడిశ నాగ రమేష్,తన వంతు సహాయాన్ని 25 కిలోల బియ్యం,బట్టలు దుప్పట్లు నిత్యవసర వంట సామాగ్రి అందించి తనకు ఏ అవసరం వచ్చినా ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు తాత్కాలికంగా రేకుల షెడ్డు నిర్మించి ఇస్తానని అతనికి హామీ ఇచ్చినాడు అదే గ్రామానికి చెందిన ముప్పు సమ్మక్క,కు 25 కేజీల బియ్యాన్ని 1500 రూపాయలు ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగింది,శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులను గాంధీనగర్ గ్రామస్తులు అభినందించారు.సమాచారం తెలుసుకుని నిరుపేద కుటుంబాలను చేయూతను అందించిన బాడిశ నాగ రమేష్,అభినందనీయుడని పలువురు గ్రామస్తులు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో బాడిశ నవీన్,చిట్యాల రాజశేఖర్,కర్రీ రామ్మోహన్,ఇందారపు రమేష్,చెట్టి పల్లి రామకృష్ణ,మడకం రమేష్, కొమరం నితిన్,గుగ్గిళ్ల సురేష్, చౌలం వేణు,బాడిశ ఆది నారాయణ,బొడ ప్రవీణ్,గట్టి పల్లి అర్జున్,బానోత్ వెంకన్న, రామావత్ దశమి,ధరావత్ శాంత,బానోతు చిలకమ్మా,గొట్టిపర్తి లక్ష్మి,గ్రామ యూత్ సభ్యులు తేజావత్ వెంకటేష్,కుల్సోత్ కళ్యాణ్, కుంతవత్ ఋషి, ఆర్ ,వెంకటేష్,గ్రామస్తులు ఉన్నారు.




