నిర్భయ చట్టం ఇదేనా?

rape-in-public-toiletన్యూఢిల్లీ: దేశరాజధానిలో మహిళలపై లైంగికదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 2012 డిసెంబర్ 16న జరిగిన నిర్భయ ఘటనకు నాలుగేండ్లు పూర్తవగా, శుక్రవారం రెండు లైంగికదాడి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మోతీబాగ్‌లో 20 ఏండ్ల యువతిపై క్యాబ్‌డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడగా, పశ్చిమ ఢిల్లీలో 16 ఏండ్ల బాలికపై ఆమె క్లాస్‌మేట్స్ ఇద్దరు లైంగికదాడికి పాల్పడ్డారు. బుధవారం జరిగిన ఈ రెండు ఘటనలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. నోయిడాకు చెందిన ఓ యువతి(20) ఉద్యో గం కోసం ఢిల్లీకి వచ్చి తిరిగి వెళ్లేందుకు బుధవారం సాయంత్రం ఎయిమ్స్ సమీపంలో బస్బు కోసం ఎదురుచూస్తున్నది. 

క్యాబ్ డ్రైవర్ అవ్నీశ్ (28) ఆమెకు లిఫ్ట్ ఇస్తానని ఎక్కించుకున్నాడు. మోతీబాగ్ ప్రాంతంలో ఓ నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో ఆమె అతడి నుం చి తప్పించుకొని వెళ్తుండగా హైవే పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడి కారును గుర్తించారు. కారు నంబ రు, కారుపై ఉన్న హోంశాఖకు చెందిన స్టిక్కర్ ఆధారంగా కారు యజమానిని ప్రశ్నించగా, కారు తన డ్రైవర్ అవ్నీశ్ దగ్గర ఉందని చెప్పారు. గురువారం తెల్లవారుజామున అవ్నీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

అతడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటాహ్ ప్రాంతానికి చెందినవాడని, మూడు నాలుగేండ్లుగా కుటుంబంతో సహా ఢిల్లీలో ఉంటూ స్కూల్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని సౌత్ డీసీపీ ఈశ్వర్ సింగ్ తెలిపారు. క్యాబ్ యజమాని తండ్రి సీఐఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్నారని, అందుకే హోంశాఖ స్టిక్కర్ వేశారని చెప్పారు. మరోఘటన పశ్చి మ ఢిల్లీలో జరిగింది. బాలిక తన క్లాస్‌మేట్ బర్త్‌డేకు హాజరుకాగా, అతడు బలవంతంగా ఆమెతో మద్యం తాగించాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి లైం గిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఇంటిలో నుంచి ఈడ్చుకొచ్చి రోడ్డు పక్కన వదిలేశారు. బాలిక అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి సెల్‌ఫోన్ తీసుకుని తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు బాలుర ను అరెస్టు చేసి కోర్టు ఆదేశంపై జువెనైల్ హోంకు తరలించారు.