నిర్భయ రేప్ కేసులో 12 గంటలకు ఛార్జ్‌షీట్
ఢిల్లీ : ఢీల్లీలో బస్సులో అత్యాచారాని గురై 13 రోజులు మృత్యుపుతో పోరాడి మరణించిన నిర్భయ కేసు ఈ రోజు నుంచి విచారణ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ పోలీసులు ఛార్జీషీటు దాఖలు చేయనున్నారు. ఎలక్ట్రానిక్ పద్దతిలో వెయ్యి పేజీల ఛార్జ్‌షీట్‌ను పోలీసులు దాఖలు చేయనున్నారు. ఈ కేసులో మృతురాలి వాగ్మూలం కీలకం కానుంది. ఈకేసులో ఆరో నిందితుడిగా ఉన్న బాల నేరస్తుడిపై జూవైనల్ హోంలో మరో ఛార్జ్‌షీటు దాఖలు చేయనున్నారు.