నిర్మల్‌కు ఐటిడిఎ ఏర్పాటు చేయాలి
ఆదిలాబాద్,సెప్టెంబర్1(జనం సాక్షి): ఉట్నూరు ఐటిడిఎకు తోడు కొత్తగా నిర్మల్ జిల్లాకు మరో ఐటిడిఎ కావాలని గిరిజన సంఘాల నేతలు అంటున్నారు. గిరిజనుల సంక్షేమం కోసం కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజనసంఘం నేతలు కోరారు. నాయక్‌పోడ్ తెగలను రీసర్వే చేసి గుర్తించాలన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, సంఘ భవనాలను నిర్మించాలని డిమాండు చేశారు. 40శాతం గిరిజనులు, ఆదివాసీ జనాభా ఉన్న గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించాలన్నారు. ఈ డిమాండ్ల సాధనకై ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.