నిర్మల చిత్తంతో భగవత్‌ ధ్యానం ! 

తిరుమల,అక్టోబర్‌26 (జనం సాక్షి): మనిషి ఎప్పుడూ నిర్మలంగా ఉంటూ..నిర్మల చిత్తంతో భగవంతుడిని ధ్యానం చేయాలి. భగవంతుడి విూద ప్రేమతో ఉండాలి. తన మనసంతా నువ్వే అన్న భావన నిండి ఉండాలి.
హృదయంలో చెడు ఆలోచనలు గూడుకట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. అందుకే గీతలో కర్మరాహిత్యం గురించి చెబుతారు. కర్మను చేయడం మనవంతు అయితే..దాని ఫలితం భగవంతుడు చూసుకుంటాడు. అంతా ఆయనే అన్న భావన ఉంటే మంచిది. మనలో ఆలోచనలు అదే పనిగా ఉంటే అవి ఒక పట్టాన మనలను వదలవు. అవి క్రమంగా ప్రేరేపితం కావడమే గాకుండా మనిషిని పక్కదారి పట్టిస్తాయి. ప్రతీకారం, హింస, హత్య వంటి ఆలోచనలను మనదరి చేరకుండా చూడాలి. వినాశనకారకమైన ఇటువంటి ధోరణులను కలగివుంటే మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లుతుంది. అందుకే శాంతచిత్తుడై భగవంతుడిని ఆరాధించాలి. మనమెన్ని చెబు పనులు చేసినా మళ్లీ భగవంతుడి ముందు మోకరిల్లితే మనకు దైవం అనుకూలించదు. దేవుడికి పూజలు చేస్తున్నాని పటాటోపం ప్రదర్శించినా పనికరాదు. అధర్మమైన, అక్రమమైన పనులకు దూరంగా ఉండేవారినే భగవంతుడు ప్రేమిస్తాడు. దుర్మార్గాలు చేసేవాళ్ళు భగవంతుడి ప్రేమకు ఎప్పుడూ దగ్గ కాలేరు. దైవం పట్ల విశ్వాసంతో తనకుతాను అర్పితులు అయ్యేవారినేఆయన చేరదీస్తాడు.ఎలాంటి స్వార్థ చింతన లేకుండా భగవంతుడికి మనం అర్పింతం కావాలి. ఫలితం ఆయనది. అలా చేసిన వారే ఆ భగవంతుడి ప్రేమకు పాత్రుల కాగలరు. ఇహపర సుఖాలు అనుభవించ గలరు.