నివేదిక వచ్చాక వాస్తవాలు తెలుస్తాయి

3

: స్మృతి

నాలేఖకు సంబంధంలేదు : దత్తాత్రేయ

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌, జనవరి18( జనంసాక్షి):   పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. హైదరాబాద్‌ సెంట్ర ల్‌ యూనివర్సిటీకి ఇద్దరు సభ్యుల బృందాన్ని పంపించామని, నివేదిక వచ్చాక వాస్తవాలు తెలుస్తాయని ఆమె సోమవారమిక్కడ అన్నారు. యూనివర్సిటీల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండదని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. ప్రస్తుతం హెచ్సీయూలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆమె తెలిపారు.  రోహిత్‌ కుటుంబ సభ్యు లకు స్మృతి ఇరానీ ఈ సందర్భంగా ప్రగాఢ సాను భూతి తెలిపారు. కాగా ఇదే ఘటనపై ఢిల్లీలోని స్మృతి ఇరానీ నివాసాన్ని ఇవాళ విద్యార్థులు ముట్టడించారు. మరోవైపు రోహిత్‌ ఆత్మహత్యపై

సహ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.హెచ్సీయూ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు.తన లేఖకు, రోహిత్‌ ఆత్మహత్యకు   ఎలాంటి సంబంధం లేదని ఆయన సోమవారమిక్కడ స్పష్టం చేశారు. ‘యూనివర్సిటీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని తనకు విజ్ఞాపన వచ్చింది.  సంఘ, జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. ఏబీవీపీ కార్యకర్తలను బాగా కొట్టినట్లుగా నాకు వినతిపత్రం వచ్చింది. దాన్ని మానవ వనరుల మంత్రిత్వ శాఖకు యథావిధిగా పంపించాను. వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తనకు తెలియదు. బీజేపీకి గాని, తనకుగాని ఎలాంటి సంబంధం లేదు. విచారణ జరుగుతోంది, అసలు విషయాలు బయటకు వస్తాయి.  నమోదైన కేసులు గురించి నేను కామెంట్‌ చేయను’ అని బండారు దత్రాత్తేయ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ …హెచ్సీయూకి అధికారులను పంపించనుంది. రోహిత్‌ ఆత్మహత్య వ్యవహారంపై ఆ బృందం రేపు నివేదిక సమర్పించనుంది.